తాజా పరిణామాలపై పాక్ మాజీ మంత్రి ట్వీట్

24-04-2025 Thu 07:13 | National
Advertisement
  • పవాల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని పాక్‌లో భయాందోళన
  • పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు
  • తమ మాతృభూమిని రక్షించుకోవడానికి రాజకీయ విభేదాలు పక్కన పెట్టి పాకిస్థాన్ జెండా కింద కలిసి ఉంటామని వెల్లడి
Advertisement
పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ హస్తం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దాడికి తామే పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో, దాడి వెనుక ఉన్న ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని పాకిస్థాన్ జాతీయులైన అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయం పాక్‌లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ ‘ఎక్స్’ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

భారతదేశం దాడి చేసినా లేదా బెదిరించినా దేశాన్ని రక్షించుకోవడానికి తామంతా కలిసి నిలబడతామని ఆయన అన్నారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ దేశం కోసం ఒక్కటిగా ఉంటామని పేర్కొన్నారు. మాతృభూమిని కాపాడుకోవడానికి పాకిస్థాన్ జెండా కింద ఐక్యంగా నిలుస్తామని తెలిపారు.

అలాగే, మోదీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లు చౌదరి ఫవాద్ మరో పోస్ట్ పెట్టారు. భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించిందని, యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఆశిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 
Advertisement
Chaudhry Fawad HussainPakistanIndiaPulwama attackTerrorismSurgical StrikesKashmirModi GovernmentLashkar-e-TaibaTRF

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more